దీంతో సదరు ఎంపీ ముఖ్య నేత బంధువు కోరినట్లు దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలు ఇచ్చి...ఆయన్ను బయటకు పంపారు. ఎంత మొత్తం ఇవ్వాలో కూడా వాళ్లే డిసైడ్ చేశారు. అంటే పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏడాదిలో 150 కోట్లు తీసుకోవటం అంటే...బహుశా ప్రపంచంలో ఎందులోనూ ఇంత లాభం రాదు అనే చెప్పొచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు వైజాగ్ లోని రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో పెద్ద సంచలనంగా మారింది. పైసా పెట్టుబడి పెట్టకుండా ముఖ్యనేత దక్కించుకున్న పది ఎకరాల విలువే కోట్ల రూపాయలు ఉంటుంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం చేతిలో ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం అనుమతులు ఇప్పించినందుకుగాను ఇంత భారీ మొత్తంలో సదరు ఎంపీ ముఖ్య నేత కు...అయన బంధువుకు భారీ మొత్తంలో సమర్పించుకోవాల్సి వచ్చింది అని చెపుతున్నారు. వైజాగ్ లో ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటూ ఈ రంగంలోని వారు వ్యాఖ్యానిస్తున్నారు.