ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ కూడా..తరచూ బీచ్ రిసార్ట్ సందర్శనలు
అక్కడ 'ప్రత్యేక ఆతిథ్యాలు'
అసలు అక్కడ ఏమి జరుగుతోంది ?. ఓ ప్రభుత్వ సలహాదారు..అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ. తరచూ అక్కడికి ఎందుకు వెళుతున్నారు. వాళ్లు అక్కడ ఏమి చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒకే జిల్లాకు చెందిన వారు. వీరి పర్యటన కూడా అత్యంత రహస్యంగా సాగుతోంది. స్థానిక పోలీసుల సాయంలో వీరు అక్కడకు వచ్చేసమయంలో ఉన్న చోట సీసీటీవీ కెమెరాలను కూడా ఆఫ్ చేయించుతున్నారు. అంతే కాదు బస చేసే రిస్టార్టు ప్రాంగణంలో కూడా వీరు వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపేస్తున్నారు. పవర్ చేతిలో ఉంటే ఇలాంటివి పెద్ద సమస్యే కాదు కదా. ఈ వ్యవహరం జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు...పార్టీలోని ప్రత్యర్దుల మధ్య కూడా ఇది ఓ అస్త్రంగా మారుతోంది. కీలక నేతలకు తమ ప్రత్యర్ధులు ఇస్తున్న రకరకాల 'ఆతిథ్యాలు' పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చాక ఈ సలహాదారుకు సంబంధించిన వ్యవహారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అవి అధిష్టానం దగ్గరకు కూడా చేరాయి. అయినా సరే మన సరదా మనదే అంటూ వీరు బీచ్ కేంద్రంగా ఎంజాయ్ చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
ఇటీవల ఓ మంత్రికి సంబంధించి, ఓ ఎమ్మెల్యేకు సంబంధించి మహిళలతో మాట్లాడుతున్న వాయిస్ లు వెలుగు చూసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. అలాంటిదే ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యవహరం కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఇదే తరహాలో వైజాగ్ కు సంబంధించి కూడా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే పేరు కూడా ఈ జాబితాలో ఉందని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చేరాల్సిన వారి దగ్గరకు చేరినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సలహాదారు చీరాల బీచ్ రసాబాస వ్యవహరంపై అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా? లేక పద్దతి మార్చుకోమని సలహా ఇస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.