హాట్ టాపిక్ గా మారిన బాలినేని ర‌ష్యా టూర్!

Update: 2021-09-06 09:38 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్, అట‌వీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ర‌ష్యా ప‌ర్య‌ట‌న హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు..ఆయ‌న ఈ ప‌ర్య‌ట‌న కోసం అత్యంత విలావవంత‌మైన ప్రైవేట్ జెట్ ను ఉప‌యోగించ‌టం.. ఆ ఫోటోను స్వ‌యంగా ఆయ‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయ‌టం విశేషం. అక్క‌డితో ఆగ‌కుండా ఆ ఫోటో కింద క్యాప్ష‌న్ కూడా అదిరేలా పెట్టారు. సాకులు వెతుక్కోకుండా జీవించండి...హాయిగా ప‌ర్య‌టించండి అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశానికి చెందిన వారు అయితే ర‌క‌ర‌కాల కామెంట్లు జోడించి మ‌రీ ఈ ఫోటోను మ‌రింత ప్ర‌చారంలోకి తెచ్చారు.

అధికారంలో ఉన్నా..ప్ర‌తిప‌క్షంలో ఉన్నా బాలినేని శ్రీనివాస‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌ల‌తో మంచిగా ఎంజాయ్ చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారంలో ఉంది. అంతే కాదు...ఓ వైపు ప్ర‌పంచం అంతా ఇంకా క‌రోనా టెన్ష‌న్ తొల‌గ‌ని ఈ స‌మ‌యంలో ఓ రాష్ట్ర మంత్రి అత్యంత విలాస‌వంత‌మైన ప్రైవెట్ జెట్ లో ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళ‌టం వెన‌క కార‌ణం ఏమిటా? అన్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భుత్వం జీవోల సైట్ నిలిపివేటంయ‌తో ఇది అస‌లు వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌నో..లేక ప్ర‌భుత్వ ప‌ర ప‌ర్య‌ట‌న అన్న అంశం కూడా తెలియ‌దు.

Tags:    

Similar News