కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..బాల‌క్రిష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-09-24 08:22 GMT
కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..బాల‌క్రిష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • whatsapp icon

విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ యూనివ‌ర్శిటీ పేరు మార్పు ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ వ్య‌వ‌హారంలో సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ఆర్ టీపీ ప్రెసిడెంట్ ష‌ర్మిల రెండు సార్లు ఈ అంశంపై స్పందించ‌టం జ‌గ‌న్ ను ఇర‌కాటంలోకి నెడుతుంద‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉంది. ఏపీలో ప్ర‌భుత్వం మారి వైఎస్ఆర్ పేరు మారిస్తే అప్పుడు అది ఆయ‌న‌కు అవ‌మానం చేసిన‌ట్లే క‌దా..ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాల‌న్న త‌ర‌హాలో ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఇదే అద‌నుగా ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌ను అటు చంద్ర‌బాబునాయుడుతోపాటు నారా లోకేష్ కూడా ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ సీఎం జ‌గ‌న్ ను ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివ‌ర్శిటీ పేరు మార్పు విష‌యంలో ప్ర‌భుత్వ స‌మ‌ర్ధ‌న ఏ మాత్రం స‌హేతుకంగా లేద‌నే అభిప్రాయం స‌ర్వత్రా వ్య‌క్తం అవుతోంది.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, హీరో నంద‌మూరి బాల‌క్రిష్ణ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్యలు ఎవ‌రిని టార్గెట్ చేసి ఈ మాట‌లు అన్న‌ది ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. బాల‌క్రిష్ట ట్వీట్ ఇలా ఉంది..'మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News