ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి గతానికి భిన్నంగా జరగబోతున్నాయి. ఎప్పుడూ ఎన్నికలను యుద్ధంతో పోలుస్తుంటారు. కానీ ఈ సారి నిజంగా యుద్ధంలాగే ఉండబోతున్నాయి. ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉంది. ఈ తరుణంలో ఒక కీలక పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఏ పార్టీ లో అయినా అధ్యక్షుడే అన్నీ చూసుకుంటే పెద్దగా సమస్యలు ఉండవు. పార్టీలో జరిగే మంచికి అయినా...చెడుకు అయినా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనిలో కొంత లాభం ఉంటుంది...కొంత నష్టం కూడా తప్పదు. కానీ సొంతంగా చూసుకునేది తక్కువ...వేరే వాళ్ళ మీద ఆధారపడేది ఎక్కువ అయితే సమస్యలు తప్పవు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అంతా తానే అయి చక్రం తిప్పుతున్న నేత ఒకరు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు అమ్మకానికి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన నేత కొడుకు దగ్గర కూడా అయన ఇలాగే డబ్బులు తీసుకున్నట్లు చెపుతున్నారు.
అది కూడా కోట్లలోనే. ఇది ఒక్కటే కాదు...కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఇలాంటి దందాలు సాగాయని...త్వరలోనే టికెట్ లో కోసం కోట్ల రూపాయలు సమర్పించుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అసలు విషయం చెప్పే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది అంతా కూడా టికెట్స్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక జరిగే అవకాశం ఉంది అని ఒక నేత వెల్లడించారు. దీంతో పాటు వాళ్లకు ఇవ్వాలి...వీళ్లకు ఇస్తున్నాను ..మేనేజ్ చేస్తున్నాను అని చెప్పి కోట్ల రూపాయలు తీసుకుని వాటిని తన ఖాతాలో వేసుకోవటంతో విషయం కీలక నేతకు తెలిసి ఆయనపై నిఘా పెట్టినట్లు చెపుతున్నారు. ఒక వైపు రాజకీయంగా సమస్యలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీ అధినేతను నమ్ముకున్న వాళ్లే ఇలా వరసపెట్టి షాక్ లు ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనకు వచ్చే కీలక సమాచారాన్ని అయన పలు రకాలుగా కూడా వాడుకుంటున్నట్లు చెపుతున్నారు.