రెడ్ బుక్ వ్యవహారంలో

Update: 2023-12-29 12:43 GMT

రెడ్ బుక్ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఆంధ్ర ప్రదేశ్ సిఐడి శుక్రవారం నాడు తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నోటీసు లు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ తమను బెదిరిస్తున్నారు అంటూ సిఐడి ఏసీబీ కోర్ట్ ను ఆశ్రయించగా కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నోటీసు లు జారీ చేశారు. వాట్సాప్ లో లోకేష్ కు నోటీసు లు పంపిస్తే..లోకేష్ కూడా వాట్సాప్ ద్వారానే నోటీసు లు అందిన విషయాన్నీ ధ్రువీకరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసే వాళ్ళ సంగతి తేలుస్తాం అని...వాళ్ళ పేర్లు అన్ని కూడా రెడ్ బుక్ లో రాస్తున్నట్లు లోకేష్ పలు మార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లోకేష్ అరెస్ట్ కు అనుమతి కోరుతూ ఏసీబీ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్ట్ జనవరి 9 వాయిదా వేసింది.

Tags:    

Similar News