ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పది..ఇంటర్ పరీక్షలు

Update: 2021-04-19 10:50 GMT

దేశమంతా ఓ దారి. ఏపీ సర్కారుది మరోదారి. కరోనా రెండవ దశ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నా ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కారు ప్రకటించింది..ఈ వివరాలను ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు. ఊరట కలిగించే విషయం ఏమిటంటే మంగళవారం నుంచే ఒకటవ తరగతి నుంచి తొమ్మిదివ తరగతి వరకూ సెలవులు ప్రకటించారు.

వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నామని..వీరికి ఎలాంటి పరీక్షలు ఉండవని మంత్రి తెలిపారు. విద్యార్ధులు నష్టపోకూడదనే పరీక్షలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీబీఎస్ఈ ఇప్పటికే పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తూ ఇఫ్పటికే రద్దుకు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుని పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News