ఏపీ మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Update: 2021-02-15 05:24 GMT

గత ఏడాది ఆగిన దగ్గర నుంచే మొదలు

ఏపీలో మరో ఎన్నికలకు నగరా మోగింది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సోమవారం నాడు అత్యంత కీలకమైన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మునిసిపల్ ఎన్నికలు మార్చి10న జరగనున్నాయి. ఫలితాలు మార్చి 14న వెల్లడి అవుతాయని ఎస్ఈసీ జారీ చేసిన  షెడ్యూల్  లో పేర్కొంది. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే గత ఏడాది వాయిదా పడిన దగ్గర నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

గత ఏడాది మార్చి 11న మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కరోనా పేరు చెప్పి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలను వాయిదా వేశారు. అయితే న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ఎక్కడ ఆగిపోయాయే అక్కడ నుంచే ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడిందని..వాటిని రద్దు చేయాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు బిజెపి కూడా కోరింది. అయితే ఎస్ఈసీ వీరి వినతులను పక్కన పెట్టి పాత నోటిఫికేషన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News