ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుదవారం నాడు సీఎం జగన్ విశాఖపట్నంలోని శారదా పీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడకు మంత్రి సీదిరి అప్పలరాజు కూడా చేరుకున్నారు. అయితే పోలీసులు ఆయన్ను శారదాపీఠంలోకి అనుమతించలేదు. ఆ సందర్భంగా జరిగిన వివాదంలో మంత్రి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఓ పోలీసు అధికారి చొక్కా పెట్టుకుని బూతులు తిట్టారు.
తమాషాలు చేస్తున్నావా. చొక్కా పట్టుకుని లాగుతా నా కొడకా..అంటూ బూతులు లంకించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రితో తనతో పాటు తన అనుచరులను కూడా శారదాపీఠంలోకి అనుమతించాలని పట్టుపట్టడంతో వివాదం తలెత్తినట్లు చెబుతున్నారు. నిజంగా పోలీసులు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలి కానీ..మంత్రిగా ఉండి వారిపై మంత్రే బూతులు మాట్లాడటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.