జూనియ‌ర్ ఎన్టీఆర్ కూ చంద్ర‌బాబు భ‌య‌ప‌డ్డారు

Update: 2022-05-28 07:39 GMT

ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్ కె రోజా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మ‌హానాడు స‌భ కేవ‌లం సీఎం జ‌గ‌న్ ను తిట్ట‌డానికే పెట్టిన‌ట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు. ప్రజలకు నమ్మకం తెప్పించి... వారికి మంచి పనులు చేస్తామన్న హామీ మహానాడులో చంద్ర‌బాబు ఇవ్వ‌లేద‌న్నారు. ఎన్టీఆర్ చనిపోయినా ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టని నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రోజా వ్యాఖ్య‌లు ఆమె మాట‌ల్లోనే...'జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారు. ప్రజాధారణ చూసి టీడీపీ నేత‌ల అవాకులు-చవాకులు పేలుతున్నారు. రాష్ట్రానికి, తెలుగు దేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని ఎన్టీఆర్ అన్నారు. మామ ప్రాణాలు తీసిన చేత్తోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంత ఘనుడో మీకే తెలుసు. 14 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రజలకు ఏమి చేయలేదు.

ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెడితే సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ....ఒక తీర్మానం చేయకపోవడం శోచనీయం. చంద్రబాబుకు... ఎన్టీఆర్ పేరు అంటే నచ్చదు.. ఆ పెరు అంటేనే భయం. జూనియర్ ఎన్టీఆర్ ను చూసి భయపడి అతనిని పార్టీ నుంచి బయటకు పంపిన ఘటనలు చూశాం. చంద్రబాబు రాష్ట్రాన్ని రవాణా కాష్టం గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన పుత్రుడు ముద్దపప్పు ఎందుకు పనికిరాడని., దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకున్నాడు. వాళ్లే అడుగుతారు... వాళ్ళు అడిగిన విధంగా కొనసీమకు అంబేద్క‌ర్ పెరు పెట్టాం .మళ్ళీ టీడీపీ, జనసేన నాయకులే విద్వంసం చేస్తున్నారు. దళిత మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను కాల్చి వేశారు పోలీసులు దెబ్బలు తిన్నా కూడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్నా..ఖ‌చ్చితంగా ఎవరిని వదిలి పెట్టేదే లేదు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది... సీఎం జగన్ చేసి చూపించారు. ఎన్ని అబద్దాలు చెప్పిన, మహిళలతో తిట్టించిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు' అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News