ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. . సర్కారు అకస్మాత్తుగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు నివేదించింది. అయితే ఇది ఎందుకు?. దీని వెనక ఉన్న మతలుబు ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పందన ఇలా ఉంది.' చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే.
శుభం కార్డుకు మరింత సమయం ఉంది. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వెనక్కి తీసుకుంటున్నాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా?. అమరావతి రైతుల పాదయాత్ర... పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదు' అని వ్యాఖ్యానించారు.