జడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్

Update: 2021-04-07 10:01 GMT

ఏపీలో ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఎన్నికలపై స్టేను డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. దీంతో గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యధావిధిగా సాగనున్నాయి. హైకోర్టు తీర్పుపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. దీనిపై వాదనలు పూర్తి అయిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తదుపరి ఆదేశాలు ఇఛ్చేవరకూ ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశించింది. అయితే ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏప్రిల్ 10న ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఓ వైపు సింగిల్ బెంచ్ హైకోర్టు జడ్జీ స్టే ఇచ్చినా కూడా ఎస్ఈసీ ఎక్కడా కూడా ప్రక్రియ ఆపకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. సిబ్బందితోపాటు ఎన్నికల ఏర్పాట్లు కూడా సాగుతూ వచ్చాయి. ఈ తరుణంలో డివిజన్ బెంచ్ తీర్పు వెలువడటంతో అనిశ్చితికి తెరపడింది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకూ ఎన్నికలు సాగనున్నాయి..

Tags:    

Similar News