ఏపీ సర్కారు కీలక నిర్ణయం!

Update: 2024-10-10 13:01 GMT

‘మూడు నెలలు చూశాం. పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ ఏ మాత్రం లాభం లేదు. మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గంట మాట్లాడితే గంట లైవ్ ఇస్తున్నారు. అది కూడా ఒకే. మళ్ళీ ఇంగ్లీష్ ఛానెల్స్ కోసం అని ఇంగ్లీష్ లో మాట్లాడిన మొత్తం కూడా లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఆ రెండు తెలుగు ఛానెల్స్ కు ఏముంది. అంతటితో ఆగటం లేదు. హైదరాబాద్ కేంద్రం గా కుట్రలు చేస్తున్నారు. వైసీపీ లో అంతా తానై నడిపించిన నాయకుడి దగ్గరికి వెళ్లి ఆయన ఏమి చెపితే అది చేయటం. ఆయన డైరెక్షన్ లోనే ఇంకా ఆ రెండు ఛానెల్స్ సాగుతున్నాయి. టార్గెట్ కూటమి సర్కారే లక్ష్యంగా వీళ్ళు వ్యవరిస్తున్నారు. ఇక యాక్షన్ తీసుకోకపోతే పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత శృతి మించే అవకాశం ఉంది. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయాలి’ అని ఆంధ్ర ప్రదేశ్ కూటమి సర్కారులో పెద్దలు ఆ రెండు ఛానెల్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కేబుల్ ఆపరేటర్స్ తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలతో సమావేశం అయి... విద్యుత్ పోల్స్ పై ఉన్న కేబుల్ లైన్లు అన్నీ కట్ చేయమంటారా...లేక ఈ రెండు ఛానెల్స్ ఆపివేస్తారో లేదో తేల్చిచెప్పాలని కోరినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

                                                     ఆ రెండు ఛానెల్స్ నిలిపివేత కూడా దసరా పండగ తర్వాత నుంచే అమల్లోకి రావాలని మంత్రి ఆదేశించినట్లు చెపుతున్నారు. ఒక్క కేబుల్స్ మార్గంలోనే కాకుండా అవకాశం ఉన్న అన్నీ ఛాన్సులను ఉపయోగించుకుని ఈ ఛానెల్స్ ప్రసారాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు వెళ్లాలనే నిర్ణయం ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం జరిగిపోయినట్లు చెపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం మీడియా చుట్టూనే తిరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇందులో ఎవరి ఇంటరెస్ట్ లు వాళ్ళవి. అయితే ఆ రెండు కీలక ఛానెళ్ల ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కనే చేరేవి. కానీ ఈ సారి మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నాయి అని చెపుతున్నారు. ఒక వైపు ప్రభుత్వంతో రాజీ కోసం అని సంకేతాలు పంపుతూనే..మరో వైపు ఎంత వీలు అయితే అంత మేర ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే పనిలో ఆ రెండు మీడియా సంస్థలు ఉన్నట్లు పలు ఆధారాలను కూడా సేకరించి పెట్టుకున్నారు. వీటి అన్నింటికి కీలకం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అని...దీని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక నాయకుడు తెలిపారు.ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పలు ఛానెల్స్ పై అనధికారిక ఆంక్షలు విధించారు. తర్వాత కాస్త పట్టు సడలించారు. అయినా వాటిలో ఏమి మార్పు లేదు అని గ్రహించి మరో సారి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు.

Tags:    

Similar News