విద్యుత్ వినియోగదారులకు సర్కారు షాక్ ఇచ్చింది. చార్జీలను భారీగా పెంచింది. ఈ బాదుడులో పెద్దగా ఎవరికీ మినహాయింపు లేదు. పెరిగిన ఛార్జీలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడబోతుంది. విద్యుత్ నియంత్రణా మండలి (ఈఆర్ఎస్) కొత్త ఛార్జీలను ప్రకటించింది. ఈ పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు.
అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు. ఇప్పటికే పలు ధరలు పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్న తరుణంలో ఈ ఛార్జీల పెంపు పెనుభారంగా మారనుంది.