దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్రాలు అన్నీ మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతున్నాయి. క్రమక్రమంగా అన్ లాక్ ప్రక్రియ ను అన్ని రాష్ట్రాలు శ్రీకారం చుడుతున్నాయి. ఏపీ సర్కారు కూడా ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో కూడా ఇటీవల వరకూ భారీగా ఉన్న కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం ప్రజలకు మరికొంత వెసులుబాటు కల్పించింది.
అదే సమయంలో కర్ఫ్యూ ను జూన్ 20 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగించారు. ఇది ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలింపు కొనసాగనుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ పనిచేస్తాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.