వివాదస్పదమైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు వ్యవహారంలో శనివారం నాడు తొలి అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం సీఐడీ అధికారులు అప్పటి ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన సాంబశివరావుతోపాటు ఐటి సలహాదారు ఉన్న వేమూరి హరిప్రసాద్ ను పలు దఫాలు విచారించారు. శనివారం నాడు ఫైబర్ నెట్ కేసులో ఐఆర్‌టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసింది.
వైద్య పరీక్షల కోసం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా సాంబశివరావును సీఐడీ విచారించింది. సాంబశివరావు ఫైబర్ నెట్‌లో ఎండీగా ఉన్నపుడు టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీకి అక్రమ కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీలో ఆయన పని చేశారు.