ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఆరు నెలల పొడిగింపు లభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి సమీర్ శర్మ నవంబర్ నెలాఖరులోగా పదవి విరమణ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయనకు ఆరు నెలల పొడిగింపు దక్కటంతో వచ్చే ఏడాది మే వరకూ పదవిలో కొనసాగనున్నారు. సీఎం జగన్ ఈనెల 2న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సిఎస్ పదవీకాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి)అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆదేశాలు జారీచేశారు.