ఎన్నికల కోర్టు ఆదేశాల నుంచి ఏపీ సీఎం జగన్ కు ఊరట లభించింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల సమన్లు జారీ చేయగా....జగన్ ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు..ఏప్రిల్ 26 వరకూ హాజరు కావాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. 2014 ఎన్నికల సందర్భంగా హూజూర్ నగర్ లో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినట్లు జగన్ పై కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది.