ఇదే అదనుగా సోషల్ మీడియా లో ఈ రెండు క్యాలెండర్లను పక్క పక్కన పెట్టి రెండు రాష్టాలను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. నల్లగొండకు చెందిన అశోక్ రెడ్డి ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఒక్క పేజీ క్యాలెండరు తో రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా చూపెట్టారు...ఇంత బాగా ఎవరూ చేయలేరు..సాక్షి టీం కు ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర సంవత్సరాల్లో బటన్లు నొక్కటం తప్ప ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.. అంతే కాదు..సొంత పార్టీ నేతలు కూడా కనీసం రోడ్ల గుంతల పూడ్చలేక పోతున్నాం..ప్రజలను ఎలా ఓట్లు అడగాలి అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సాక్షి క్యాలెండరు రూపంలో ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం దొరికినట్లు అయింది. చేసింది ఏమీ లేక...వేసుకోవటాని ఏమీ లేక క్యాలెండరు లో చారిత్రక ప్రదేశాల బొమ్మలతో సరిపెట్టారనే విమర్శలు రావటం పక్కా.