ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌పై మంత్రుల క‌మిటీ కొన‌సాగుతుంది

Update: 2022-02-06 08:18 GMT

పీఆర్సీ అంశంపై మంత్రుల క‌మిటీ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌టంతో ఉద్యోగ సంఘాల నేత‌లు ఆదివారం నాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. ఈ సంద్భరంగా వీరు జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్రభుత్వం తమ కోరికలను స‌మ్మ‌తించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అందులోని ముఖ్యాంశాలు ' ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు.

ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది. ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోంది. హెచ్‌.ఆర్‌.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇది. మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News