తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎప్పటిలాగానే ఒక్కరే వచ్చి సీఎం హోదాలో పట్టు వస్త్రాలు అందజేశారు. గరుడ వాహన సేవలో కూడా సీఎం పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటానికి ముందు జగన్ తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు.