ఏపీ మంత్రివ‌ర్గం రాజీనామా

Update: 2022-04-07 12:07 GMT

రాష్ట్ర మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు వీలుగా సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గం మొత్తం రాజీనామా చేసింది. గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. ఇందులో ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది.

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు. అనుభ‌వం రీత్యా కొంత మంది మాత్రం మంత్రులు కొన‌సాగుతార‌ని సీఎం మంత్రివ‌ర్గంలో తెలిపారు. రాజీనామా చేసిన మంత్రులు అంతా త‌మ సొంత వాహ‌నాల్లో ఇళ్ళ‌కు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు కొత్త మంత్రివ‌ర్గంలోకి ఎవ‌రెవ‌రు వ‌స్తార‌న్న చ‌ర్చ సాగుతోంది. 

Tags:    

Similar News