ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. పాత, కొత్త కలయికలతో మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని సచివాలయం పక్కనే ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద మంత్రుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసిన 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదవగా. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా మొదట సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు అంబటి రాంబాబు ఏపీ కేబినెట్‌గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ప్రమాణంతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్‌లో పాత మంత్రులను 11 మందిని కొనసాగించగా.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారి జాబితా ఇలా ఉంది. అంబటి రాంబాబు, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని.