అసెంబ్లీ ఎస్ఎఫ్ టి నిర్మాణ వ్యయం 5503 రూపాయలు!

Update: 2025-04-06 06:15 GMT
అసెంబ్లీ ఎస్ఎఫ్ టి నిర్మాణ  వ్యయం 5503 రూపాయలు!
  • whatsapp icon

హై కోర్ట్ కు మాత్రం 3881 రూపాయలు !

విస్మయం వ్యక్తం చేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులు

అంతా పెద్దలు చెప్పినట్లు ఆడుతున్న సిఆర్ డీఏ అధికారులు!

అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు మళ్ళీ అదే మోడల్ ఫాలో అవుతున్నారు. అమరావతి విషయంలో ఫస్ట్ టర్మ్ లో చేసిన తప్పులే ఇప్పుడు కూడా చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టెండర్ల కేటాయింపు తో పాటు ధరల నిర్ధారణ విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్ మాల్ జరుగుతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యల పనులను అస్మదీయ కంపెనీలకే కేటాయిస్తూ ఏ మాత్రం పోటీ లేకుండా చేసి ప్రజలపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం మోపుతున్నారు అని అధికార వర్గాలే చెపుతున్నాయి. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం తాను అనుకున్న విధంగానే ముందుకు వెళుతోంది. శనివారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ నూతన అసెంబ్లీ, హై కోర్ట్ నిర్మాణ పనులను ఓకే చేశారు.

                                                617 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టు ను ఎల్ అండ్ టి కి, హై కోర్ట్ నిర్మాణ పనులను ఎన్ సిసి కి అప్పగించారు.హై కోర్ట్ నిర్మాణ వ్యయం 786 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ రెండు కంపెనీలకు లెటర్ అఫ్ అవార్డు (ఎల్ ఓఏ) ఇవ్వటానికి సిఆర్ డీఏ ఆథారిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ లెక్కన చూస్తే అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5503 రూపాయలు అవుతుంటే...హై కోర్ట్ కు మాత్రం చదరపు అడుగుకు 3881 రూపాయలు అవుతుంది. ఒకే ప్రాంతంలో నిర్మించే భవనాల నిర్మాణంలో నిర్మాణ వ్యయం ఇంత తేడా ఎందుకు ఉంటుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన వాళ్ళు బిల్డింగ్ బిల్డింగ్ కు ఒక రేట్ ఉంటుందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.

                                      మరో వైపు ల్యాండ్ లేకుండా కేవలం అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5503 రూపాయలు అంటే చాలా ఎక్కువ అని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఒక బిల్డింగ్ లో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3881 రూపాయలు అవుతుంటే...మరో వైపు అసెంబ్లీ బిల్డింగ్ కు మాత్రం చదరపు అడుగు వ్యయం 5503 రూపాయలు అవుతుండటం ఆశ్చర్యకరంగా ఉంది అనే చెప్పాలి. పోనీ నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ఇవే రేట్లు ఉంటాయని కూడా గ్యారంటీ ఏమి ఉండదు. పనులు పూర్తి అయ్యే లోపు మధ్యలో మళ్ళీ ఏదో ఒక కారణాలు చెప్పి అంచనాలు సవరించే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News