ఆ బాధ్యత ఇప్పుడు ఉద్యోగులపై!

Update: 2024-06-20 04:07 GMT

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాల్లో అసలు తనకు పేపర్, టీవీలు లేవు అని బహిరంగంగానే చెప్పారు. నిజం ఏంటో రాష్ట్ర ప్రజలకే కాదు..దేశం అందరికి తెలుసు. అయినా సరే తనకు అసలు మీడియా లేదు అనే అబద్దాన్ని ఎంతో కాన్ఫిడెన్సు తో చెప్పేవారు. ఈ కాన్ఫిడెన్స్ చూసి వైసీపీ వాళ్లకు కూడా ముచ్చటేసేది. ఎందుకంటే అబద్దాన్ని కూడా జగన్ అంత దైర్యంగా చెపుతున్న తీరు చూసి గతం లో ఉన్న నాయకులూ ఎవరూ కూడా మా జగన్ ముందు పనికిరారు అనుకునే వాళ్ళు మరి వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓటమితో జగన్ కు పవర్ పోవటం ఒక్కటే కాదు. జగన్ ఫ్యామిలీ కి చెందిన సాక్షి పత్రిక కూడా చిక్కుల్లో పడింది అని మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వాలంటీర్లు. కొంత కాలం వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి మరీ సాక్షి పత్రిక కొనుగోలు చేసేలా చూశారు. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీం కోర్ట్ వరకు కూడా వెళ్ళింది. వాలంటీర్లతో అధికారిక కొనుగోళ్లు ఒకటి అయితే...వాళ్లకు సాక్షి పత్రిక అమ్మకాల బాధ్యత కూడా అప్పగించారు. ఎందుకంటే వాలంటీర్లు ఎక్కువ మంది వైసీపీ వాళ్లే అనే విషయాన్నీ ఎంపీ విజయసాయి రెడ్డి తో పాటు మాజీ మంత్రులు బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. కారణాలు ఏమైనా వైసీపీ ఓడిపోవటం, వాలంటీర్ల కొనుగోళ్లు లేకపోవటంతో గత కొన్ని నెలల కాలంలోనే దగ్గర దగ్గర రెండు లక్షల మేర సాక్షి సర్కులేషన్ పై ప్రభావం పడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

                                                             ఒక పత్రిక కు రెండు లక్షల సర్కులేషన్ పడిపోవటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పడిపోయిన ఈ సర్కులేషన్ ను తిరిగి రికవరీ చేయాల్సిన బాధ్యతను సాక్షి సిబ్బంది కే అప్పగించినట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత భారీ మొత్తంలో సిబ్బంది సర్కులేషన్ ను తిరిగి రాబట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా అంటే అనుమానమే అని చెపుతున్నారు. జగన్ అధికారంలో ఉండగా ఫ్యామిలీ పత్రిక సాక్షికి యాడ్స్ ఇవ్వటం కోసమే తన నవరత్నాల క్యాలెండరు ను డిజైన్ చేసినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ జమానాలో సొంత పత్రిక సాక్షికి ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు. ఇదే అదనుగా సమాచార శాఖలోని ఉన్నతాధికారులు కొన్ని ఆంగ్ల పత్రికల దగ్గర నుంచి ముందే పదిహేను నుంచి 25 శాతం వరకు కమిషన్ తీసుకుని వాటికీ కూడా పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ విషయాలు అన్నింటిపై విచారణ జరిపిస్తే కళ్ళు తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Tags:    

Similar News