వివేకా హత్య వివరాలు చెప్పినా పట్టించుకోలేదు

Update: 2021-04-16 07:48 GMT

వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో మరో మలుపు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సీబీఐ డైరక్టర్ కు లేఖ రాశారు.అందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత చాలా సేపటి వరకూ ఎవరినీ లోపలికి అనుమతించలేదన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులే పోలీసులను కావాలని అడ్డుకున్నారన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని దర్యాప్తు అధికారికి రెండుసార్లు చెప్పినా కూడా స్పందించలేదని ఏ బీ వెంకటేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి ఎన్ కె సింగ్ కు స్వయంగా ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదన్నారు. వివేకానందరెడ్డి హత్యని కొంత మంది ఎంపీలు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

హత్య జరిగిన తర్వాత ఇళ్ళు అంతా కడిగేసి, మృతదేహన్ని ఆసుపత్రికి తరలించే వరకూ ఘటనా స్థలిని ఎంపీ అవినాష్ రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని వెల్లడించారు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులతోపాటు మీడియాను కూడా అనుమతించలేదన్నారు. అయితే మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి నిఘా విభాగం అందజేసిందని తెలిపారు. ఈ హత్య జరిగినప్పుడు తాను ఇంటెలిజెన్స్ చీప్ గా ఉన్నానని , ఈ కారణంగానే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News