కొంత మంది రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు

Update: 2020-09-28 05:34 GMT

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే కొంత‌మంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారికి మంచి బుద్దిని ప్రసాదించాలని దేవుడిని కోరుకున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నానాటికీ దిగజారుతున్న మానవతా, నైతిక విలువలను కాపాడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

వ్యవస్థల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు, అభిప్రాయభేదాలు లేకుండా అంబేద్కర్ ఏంతో ముందు చూపుతో రాజ్యాంగం రాశారని పేర్కొన్నారు. కొంత మంది స్వప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా ఏపీ సర్కారు న్యాయవ్యవస్థతో ఘర్షణ పూరిత వైఖరి అవలంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

Similar News