మంగళవారం సాయంత్రం అమిత్ షాతో భేటీ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ఖరారు అవటం ఆసక్తికర పరిణామంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మంగళవారం సాయంత్రం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. న్యాయవ్యవస్థతో ఏపీ సర్కారు ఘర్షణ, ఏకంగా పార్లమెంట్ లోనే ఈ అంశంపై నేరుగా వైసీపీ గళమెత్తటం, మూడు రాజధానుల అంశంతోపాటు పలు అంశాలపై అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉన్నా..తర్వాత ఈ భేటీ రద్దు అయింది. తాజా పర్యటనలో సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. అక్కడ నుంచే ఆయన బుధవారం సాయంత్రం తిరుమల చేరుకుంటారని చెబుతున్నారు.