
ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖ రాశారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ రాశారని అన్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు.