భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 50 వేల కోట్లకు

Update: 2020-07-27 06:08 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కాలుష్య రహిత వాహనాలు కావటంతో చాలా మంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. కాకపోతే అవి ప్రస్తుతం ఉన్న అన్ని విభాగాల వాహనాల కంటే ఖరీదైన వ్యవహారంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారీగా పెరగనుంది. 2025 నాటికి భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) మార్కెట్ 50 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని ఓ అంచనా. అవెండస్ క్యాపిటల్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. అదే సమయంలో ద్విచక్ర వాహనాల మార్కెట్ 12 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని తెలిపారు. ఈ ఆటో విభాగం కూడా జోరు చూపించవచ్చని ఈ నివేదిక చెబుతోంది.

Similar News