బాలీవుడ్ లో ఎన్టీఆర్ సందడి

Update: 2024-05-01 08:49 GMT

Full Viewటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హంగామా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ కోసం కొన్ని రోజులు ముంబై లో మకాం వేసిన ఎన్టీఆర్ బాలీవుడ్ పార్టీలకు కూడా హాజరు అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒక వైపు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే మరో వైపు వార్ 2 షూటింగ్ పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టారు.. దేవర మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నెలలో అంటే మే 20 న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఉండే అవకాశం ఉంది.

                                                               ఇందులో ప్రధానమైనది సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ పనితనం అంటే తనకు ఎంతో ఇష్టమని.. తారక్ కి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నాను. జయహో అంటూ ఫోటో కింద రాసుకొచ్చారు.

Tags:    

Similar News

అంతా రెడీ