ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే జగన్ మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలవాల్సి ఉంది. మంగళవారం ఉదయం కూడా పర్యటనకు జగన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
కానీ సడన్ గా ఢిల్లీ పర్యటన రద్దు అయినట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏమిటో తెలియాల్సి ఉంది. హోం మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించటంతోపాటు పెండింగ్ లో ఉన్న మండలి రద్దు బిల్లు తదితర అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశం ఉందని భావించారు.