ఆంధ్రప్రదేశ్ సర్కారు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను మంగళవారం నాడు శాసనసభ ముందు ఉంచింది. 2,24,789.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ 2,24,789.18 కోట్ల రూపాయల బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 1,80,392.65 కోట్ల రూపాయలుగా, మూలధన వ్యయం అంచనా 44,396.54 కోట్లు రూపాయలుగా పేర్కొన్నారు. జగన్ సర్కారు ఎప్పటిలాగానే ఈ సారి బడ్జెట్ లో కూడా సంక్షేమంపైనే ఫోకస్ పెట్టింది.