చంద్రబాబు రాజకీయ పుస్తకం చినిగిపోయింది..కొత్త పేజీలు లేవు

Update: 2020-06-19 07:17 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బలం లేదని తెలిసినా కూడా టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపటం నీచం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చినిగిపోయిందని, ఇక అందులో కొత్త పేజీలు లేవన్నారు. వైసీపీ ఎంపి రఘురామరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుందని తెలిపారు.

గతంలో ఉన్నప్పుడు గుర్తురాని దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. సంఖ్యాభలం లేనప్పుడు ఓటమి తప్పదు అని తెలిసి కూడా వర్ల రామయ్యను బరిలోకి దింపటం దళితులను అవమానించటమే అన్నారు. చంద్రబాబు అంత మోసగాడు ఎవరూ లేరని, ఆయన జీవితం అంతా కుట్ర రాజకీయాలే అని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టం లేని చంద్రబాబు...గవర్నర్ ను ఎలా కలుస్తారు అని బొత్స ప్రశ్నించారు.

Similar News