తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై నందిగామలో కేసు నమోదు అయింది. కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘించారనే అంశంపై ఆయనపై కేసు నమోదు చేశారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ జాతీయ రహదారిపై గుమిగూడిన తెలుగుదేశం కార్యకర్తల దగ్గర కాన్వాయ్ ఆపిన చంద్రబాబు వారికి అభివాదం చేసి ముందుకు కదిలారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసుల నమోదు చేశారు. ఇప్పటికే ఇదే అంశంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది.