తగ్గినట్లే తగ్గి ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా నెల్లూరు జిల్లాలో ఆరు, కృష్ణ జిల్లాలో ఆరు, చిత్తూరులో 3 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన 15 కేసులతో కలిపి ఏపీలో కేసుల సంఖ్య 329కి పెరిగింది.
కర్నూలులో అత్యధికంగా 74 కేసులు, నెల్లూరులో 49, గంటూరులో 41 కేసులు, కృష్ణాలో 35 కేసులు, ప్రకాశంలో 24 కేసులు, విశాఖపట్నంలో 20 కేసులు ఉన్నాయి. చిత్తూరులో 20 కేసులు, పశ్చిమ గోదావరిలో 21, తూర్పు గోదావరిలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.