విజయవాడలో మంత్రి బొత్స ఇల్లు ముట్టడి

Update: 2019-12-27 04:46 GMT

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ కొంత మంది ఈ చర్యకు దిగారు. బొత్స ఇంటి ముట్టడికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ప్రకటనలు చేస్తున్నారు.

Similar News