ఏపీకి చెందిన మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆరు నెలల్లో ఏ చట్టసభలోనూ సభ్యుడు కాలేకపోయిన కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా అనివార్యంగా మారింది. శుక్రవారానికి ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కానుండటంతో ఆయన రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను సీఎం కార్యాలయానికి పంపారు. అక్కడ నుంచి రాజ్ భవన్ కు ఈ లేఖను పంపనున్నారు. ఇదిలా ఉంటే శ్రావణ్ కుమార్ గురువారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య భేటీలో రాజీనామా అంశమే చర్చకు వచ్చినట్లు సమాచారం.