కుప్పం విమానాశ్రయం... వంద కోట్లు కావాలట!

Update: 2018-07-30 04:36 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి. ఏపీలోని పలు జిల్లాలో సరైన రోడ్లు లేవు...తాగటానికి మంచి నీళ్లు లేవు. అవేమీ పట్టించుకోని సీఎం చంద్రబాబునాయుడు ఎంత సేపూ గగనవిహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గాలిలో మేడలు కడుతున్నారు. అసలు జిల్లా కేంద్రాల్లో కట్టిన విమానాశ్రయాలకే పెద్దగా ట్రాఫిక్ ఉండదు. ఉదాహరణకు కడపలో విమానాశ్రయం కట్టినా..అక్కడకు విమాన కనెక్టివిటి తక్కువే. ఉన్నా ఆక్యుపెన్సీ రేషియో అంతంత మాత్రమే. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం కట్టుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదన ఏ రకంగా ఆమోదయోగ్యం కాదని అధికారులు తేల్చేశారు. అనుమతులు కూడా వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే కేవలం 20 సీట్లతో కూడిన విమానాలు అయినా దిగేందుకు ఏపీ ప్రభుత్వ ఖర్చుతో ఓ ఎయిర్ స్ట్రిప్ అభివృద్ధి చేయాలని..దీనికి ఓ వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని ఫైలును ఆర్థిక శాఖకు పంపారు. అయితే ఆర్థిక శాఖ అసలు కుప్పంలో ఎలాంటి విమానాశ్రయం లాభదాయకం కాదని..అక్కడ అసలు విమానాశ్రయం అవసరంలేదని తేల్చేసింది.

అధికారులు కాదన్న పనులు సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని చేయలేదు. ఆయన కేబినెట్ లో పెట్టి అయినా సరే దీన్ని ఆమోదింపచేసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక విమానాల్లో తప్ప...మామూలు విమానాల్లో తిరగటానికి ఏ మాత్రం ఆసక్తి చూపని చంద్రబాబు..తన సొంత నియోజకవర్గానికి ఏకంగా 100 కోట్ల రూపాయలతో 20 సీట్ల విమానాలు దిగే ఏర్పాటు అంటే ..అది కేవలం ఆయన సొంత అవసరాలకే అన్నట్లు. చంద్రబాబు కాకపోతే ఎవరు ఆ నియోకజవర్గానికి చార్టెట్ ఫ్లైట్ వేసుకుని వెళ్లగలితే పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం చంద్రబాబు సౌకర్యం కోసం వంద కోట్ల రూపాయలు పెట్టి విమానాశ్రయం కట్టాలా?. ఓ వైపు ఏపీ కష్టాల్లో ఉందని..నిధులకు కట కట అంటూ ఒక్క వ్యక్తి కోసం విమానాశ్రయం కట్టుకోవాల్సిన అవసరం ఉందా?. అంతకు ముందు జిల్లాకు ఒక విమానాశ్రయం కడతామని చెప్పి..ఆ హామీని అటకెక్కించారు.

 

 

 

Similar News