చంద్రబాబుకు లేని పోస్టు కట్టబెట్టిన జగన్

Update: 2018-03-08 08:26 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జగన్ ఓ కొత్త పోస్టు కట్టబెట్టారు. అది ఆయనకు ఎవరూ ఇవ్వలేదు కూడా. కానీ జగన్ ఇచ్చేశారు ఆ పోస్టు. అదేంటి అంటే చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ అట. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే కన్వీనర్ గా ఎవరినీ నియమించలేదు. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది కానీ...ఎన్డీయే కన్వీనర్ పోస్టు ఏమీ చంద్రబాబుకు ఇవ్వలేదు. కానీ గురువారం నాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదే పదే చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా ఉన్నారని వ్యాఖ్యానించటం విశేషం. ఒక్క జగనే కాదు..వైసీపీ నేతలూ కూడా అదే పనిచేస్తున్నారు.

వైసీపీ నేతలు కూడా టీవీ చర్చల్లో చంద్రబాబు ను ఎన్డీయే కన్వీనర్ గా ఉన్నారని వాదిస్తున్నారు. చంద్రబాబును ఎన్డీయే కన్వీనర్ గా జగన్ పేర్కొనటంపై వైసీపీ నేతలు కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ మాటనే ఆ పార్టీ నేతలు కూడా గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అది తప్పు అయినా కూడా. పోనీ చర్చలు నిర్వహించే ఛానల్స్ అయినా చంద్రబాబు ఎక్కడ ఎన్డీయే కన్వీనర్ గా ఉన్నారు? అంటారా అదీ లేదు. సో..జగన్ చెప్పాడు..వాళ్లు కొనసాగిస్తున్నారు. అంతే.

 

Similar News