లైంగిక వేధింపుల కేసులో మరో ప్రముఖుడు బుక్కయ్యాడు. ఓ యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు.. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఈ వెబ్ రేడియో గజల్ శ్రీనివాస్‌దే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.
ఆథ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నో కళారూపాలు చేసిన గజల్ శ్రీనివాస్ లైంగికవేధింపుల కేసులో అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలతోనే బాధితురాలు ఫిర్యాదుచేసినట్లు సమాచారం. గజల్ శ్రీనివాస్ రాజకీయ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గజల్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తే. విదేశాల్లో జరిగిన పలు తెలుగు సభల్లో ఆయన ప్రొగ్రాంలు చేశారు.