రాహుల్ గాంధీతో విజయశాంతి భేటీ

Update: 2017-11-08 03:58 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. తాజాగా టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీమ్ తో పార్టీలో జోష్ పెరిగింది. ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగి తర్వాత ఆ పార్టీకి దూరమైన విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారు. ఆమె కాంగ్రెస్ లోనే ఉన్నా..గత మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా యాక్టివ్ గా లేరు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో విజయశాంతి మళ్లీ రంగ ప్రవేశం చేశారు. మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.  

                             ఆమె రాహుల్ ను కలిసిన  సమయంలో ఎఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి రామచంద్ర కుంతియా, తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్నారని, ఇప్పుడు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. 

 

 

Similar News