వర్మకు సినిమాలే కాదు..రాజకీయాలు సరదానే. అందుకే ఏ అంశాన్ని వదిలిపెట్టరు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని బాహుబలిగా పోల్చి సంచలనం రేపిన ఈ దర్శకుడు మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 పోస్టర్లను మార్ఫింగ్ చేసి అందులో రేవంత్ రెడ్డిని ఇరికించేశాడు, అంతే కాదు..వాటి కింద ‘రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్’..బాస్ ఈస్ హియర్ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టేశాడు.
ఇవి ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసి మెగాభిమానులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌పై తనకున్న ప్రేమను ప్రదర్శించేందుకు తమ అభిమాన హీరో పోస్టర్స్‌ను వాడుకోవడంపై చిరు ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.