హైదరాబాద్ నుంచి ముంబయ్ వెళుతున్న ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. ఆమె శనివారం ఇండిగో విమానంలో ముంబయ్ వెళుతున్న సమయంలో అజితేశ్ అనే ఉద్యోగి ఆమెతో అభ్యంతరకరంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని స్వయంగా సింధు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
విమానానికి సంబంధించి గ్రౌండ్ స్టాఫ్ అజితేశ్ నాతో అనారికంగా వ్యవహరించాడని తెలిపింది. అతని తీరుపై ఎయిర్ హోస్టేస్ అభ్యంతరం వ్యక్తం చేసినా..అజితేశ్ ఆమెపై కూడా అదే రీతిలో అభ్యంతరకరంగా వ్యవహరించాడని వెల్లడించింది. ఇలాంటి సిబ్బంది ఉంటే ఇండిగో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిటనం ఖాయం అని సింధు పేర్కొంది.