ఆర్థిక కష్టాల్లో ‘నవ తెలంగాణ పత్రిక’!

Update: 2017-11-03 05:41 GMT

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా పెట్టిన నవ తెలంగాణ పత్రిక ఆర్థిక కష్టాల్లో పడిందా?. అంటే అవునంటున్నారు ఆ సంస్థ సిబ్బంది. తాజాగా ఓ సమావేశం పెట్టి సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని..వేతనాలు ఎప్పుడు ఇస్తామో చెప్పటం కష్టమని మానిసకంగా సిద్ధంగా ఉండాలని సూచించారట. వేతనాలు ఇచ్చే తేదీ ఐదు కావచ్చు..15 వరకూ వెళ్లొచ్చు ఖచ్చితంగా తేదీ చెప్పలేమని తేల్చిచెప్పారట. అంతే కాదు..ఇంక్రిమెంట్లు వంటి అంశాలు అయితే మర్చిపోవాల్సిందే అని ప్రకటించినట్లు సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీపీఎంకు చెందిన ప్రజాశక్తి పత్రిక ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయింది. తెలంగాణ శాఖ ‘నవ తెలంగాణ’ పత్రికను పెట్టింది.

                            ఇప్పటివరకూ సకాలంలోనే వేతనాలు చెల్లించిన ఈ సంస్థ ముందున్నది కష్టకాలమే అని చెప్పటంతో ఉద్యోగులు అవాక్కయ్యారు. అదే ప్రజాశక్తిలో మాత్రం తాజాగా ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులతోపాటు పర్మినెంట్ ఉద్యోగులకు కూడా ఇవి అందాయి. కానీ తెలంగాణలో ఉన్న నవ తెలంగాణ పత్రికలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ శాఖ పరిధిలో ఉన్న అశోక్ నగర్ ఆఫీసును  48 లక్షలకు కొనుగోలు చేశారు ఎప్పుడో. ఈ భవనాన్ని ఇప్పుడు మూడు కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ భవనాన్ని కొనుగోలు చేసేది కూడా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసే  సీపీఎం అనుబంధ కార్మిక సంఘం సీఐటియు కావటం విశేషం.  

 

Similar News