హైదరాబాద్ లో ప్రధాని మోడీ ...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ల పర్యటనలు ఖరారు అయ్యాయి. మోడీ ఒక్క రోజు హైదరాబాద్ లో పర్యటిస్తుండగా..ఇవాంకా మాత్రం రెండు రోజులు హైదరాబాద్ లో ఉండనున్నారు. భాగ్యనగరానికి అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అదేరోజు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ఆయన ప్రారంభిస్తారు. మోడీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. 28న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకుంటారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్‌కు వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మెట్రో రైలును ప్రారంభిస్తారు.
అనంతరం మెట్రో రైలులో కూకట్‌పల్లి వరకు ప్రయాణిస్తారు
సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైటెక్స్‌కు చేరుకుంటారు
ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు
తర్వాత రోడ్డు మార్గంలో హైటెక్స్ నుంచి ఫలక్‌నుమా హోటల్‌కు చేరుకుంటారు
రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందులో మోదీ, ఇవాంకా పాల్గొంటారు
ఇవాంకా టూర్ షెడ్యూల్ ఇది
28న హైదరాబాద్‌కు రానున్న ఇవాంకా ట్రంప్
28న సాయంత్రం 4 గంటలకు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు
తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందులో పాల్గొంటారు
రాత్రికి మాదాపూర్‌లోని హోటల్‌లో బస
29 మధ్యాహ్నం అమెరికాకు తిరుగు పయనం అవుతారు.