హైదరాబాద్ ప్రజలు మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మెట్రో ధరలు తగ్గిస్తే మాత్రం ఇది మరింత సక్సెస్ అవుతుందని..లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారీ ఈ రేట్లను భరించే అవకాశంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బుధవారం ఉదయం నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం కావటంతో చాలా మంది తొలి రోజే ప్రయాణ అనుభూతిని పొందటానికి రెడీ అయిపోయారు. చాలా మంది మెట్రో రైడ్ ను ఎంజాయ్ చేస్తూ తమ తొలి ప్రయాణ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మెట్రో ఎంతో నీట్ గా పర్పెక్ట్ గా ఉందని అంటూనే..రేట్ల విషయంలో మాత్రం చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడప్పుడు ప్రయాణించే వారికి ఫర్వాలేదనిపించినా, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ఈ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే రూ.60 చెల్లించాల్సిందే. అదే నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు రూ.45గా ఉంది. ఇవి బస్సు టికెట్ ధరల కన్నా ఎక్కువగా ఉండటంతో సామన్యులు వీటిని భారంగా భావిస్తున్నారు. పలు వర్గాల నుంచి రేట్లు తగ్గించాలనే డిమాండ్ విన్పిస్తున్నా...ఇది ఏ మేరకు సాధ్యం అవుతుందో అన్న అనుమానాలు ఉన్నాయి.