వచ్చే ఏడాది నుంచి స్లీపర్ వెర్షన్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ట్రైన్ మోడల్ కు సంబంధించిన కొన్నిఫోటోలను అయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. స్లీపర్ వెర్షన్ కాన్సెప్ట్ ట్రైన్ వివరాలు పంచుకున్నారు. ప్రస్తుతం రైళ్లలో ఉన్న వాటికంటే మరింత వెడల్పుగా బెర్తులు ఉండటంతో పాటు మెరుగైన ఇంటీరియర్స్ ఉంటాయని తెలిపారు. ఈ ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ ఇవి ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ తరహాలో ఉన్నాయంటూ కామెంట్ చేశారు. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న స్లీపర్ వందే భారత్ రైళ్లలో చార్జీలు ఎలా ఉంటాయో వేచిచుడాల్సిందే. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇవి కూడా ప్రీమియం రేంజ్ లోనే ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.