ఒక్క దెబ్బకు 1 .40 లక్షల ఫాలోవర్స్ ఔట్

Update: 2026-02-19 05:23 GMT

సోషల్ మీడియా లో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. కొంత మంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఒరిజినల్ ఫోటో ల కు బదులు సినీ సెలెబ్రిటీల ఫోటో లు పెట్టి మాయ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, పేస్ బుక్ లో పరిచయం అయిన వాళ్ళతో కూడా ప్రేమలో పడి మోసపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వార్తలు నిత్యం మీడియాలో వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా సాగిన ‘అందమైన’ మోసం ఇది. చైనా కు చెందిన ఒక మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ లైవ్ లో ఉండగా సాంకేతిక సమస్యతో బ్యూటీ ఫిల్టర్లు పనిచేయటం మానేశాయి. దీంతో లైవ్ లో ఆమె ఒరిజినల్ పేస్ బయపడింది. సోషల్ మీడియా లో ఈ క్లిప్ వైరల్ గా మారింది. ఆమె ఒరిజినల్ పేస్ కు పూర్తి భిన్నంగా లైవ్ లో ఒక బొమ్మలాగా అందంగా కనిపించే ఫిల్టర్స్ ను ఉపయోగించి ఇంత కాలం ఆమె తన ప్రేక్షకులను మోసం చేసింది.

                                         Full Viewఇది వాళ్ళను షాక్ గురి చేయటమే కాకుండా...పెద్ద వివాదంగా కూడా మారింది. అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఆమె ఫాలోవర్స్ లక్ష నలభై వేల మంది తగ్గిపోయారు. అయితే ఇంత కాలం ఆమెను ఫాలో అయిన వాళ్ళు ఆమె చెప్పిన విషయాల ఫాలో అయ్యారా లేక ఆమె అందంగా ఉంది అని ఫాలో అయ్యారా అన్న చర్చ కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అయితే ఎక్కువ మంది మాత్రం ఆమె తన ఒరిజినల్ పేస్ దాచి బ్యూటీ ఫిల్టర్లు ద్వారా మోసం చేసింది అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ మీడియా లో కూడా ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News