ఇరాన్ తో మరో ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధం అవుతోంది. కొద్దిరోజుల క్రితమే ఒక ఒప్పందం చేసుకుని...రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మరో ఒప్పందానికి రెడీ అవుతున్నామని...దీనికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు. అందుకే ఇరాన్ పై తలపెట్టిన భారీ దాడులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. వేగంగా ఒప్పందం ఖరారు కాకపోతే మాత్రం మళ్ళీ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రాధమికంగా ఒప్పందంపై ఒక అంచనాకు వచ్చినందున దాడులు ఆపాల్సిందిగా ఇరాన్ తో పాటు పశ్చిమాసియా దేశాలు కోరినట్లు ట్రంప్ చెపుతున్నారు. వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవటం, ఇరాన్ నుంచి అణు ప్రమాదాన్ని నివారించటం ఈ ఒప్పందంలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రపంచ ప్రయోజనాలు..ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకుని దాడులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.